![]() |
![]() |

ఏం తినాలనుకుంటే అది తినాలంతే. ఎందుకంటే ఎప్పుడు పోవాలనుకుంటే అప్పుడు పోవాలి అదీ లెక్క.. దీనికోసం మళ్ళీ ఓ వందేళ్లు బతికాల్సిన పని లేదు.. నాలుగు స్వీట్లు తినే యోగం లేదు.. నాలుగు హాట్ లు తినే యోగం లేదు. ఇవి శ్రీ గరికపాటి నరసింహారావు గారి ప్రవచనాల్లో కొన్ని మాటలు. వీటిని బేస్ చేసుకొని ఎన్నో రీల్స్ ఎంతో మంది నెటిజన్లు చేశారు. అయితే ఇందులో బ్రహ్మముడి సీరియల్ లోని అనామిక, ధాన్యలక్ష్మి , ప్రకాష్ కూడా ఉన్నారు. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో వీళ్ళు ముగ్గురు కలిసి ఈ రీల్ చేశారు. అది వైరల్ గా మారింది.
బ్రహ్మముడి సీరియల్ స్టార్ మా టీవీలో ప్రసారమవుతోంది. ఇక ఈ సీరియల్ కథ అందరిని ఆకట్టుకుంటుంది. దుగ్గిరాల కుటుంబం ఓ వైపు, కనకం-కృష్ణమూర్తి మరోవైపు రెండు కుటుంబాల చుట్టూ తిరుగుతుంటుంది. కళ్యాణ్-అనామికల పెళ్ళి తర్వాత కథలో చాలా మార్పులు వచ్చాయి. కళ్యాణ్ జాబ్ చేయాలని జాబ్ చేస్తేనే శోభనం అని అనామిక చెప్పడంతో అతను ఆఫీస్ కి వెళ్తుంటాడు. అయితే అనామిక రాగానే ధాన్యలక్ష్మి తనకి సపోర్ట్ గా కావ్యకి వ్యతిరేకంగా మారిపోవడంతో ఈ సీరియల్ మరింత ఆసక్తిగా మారింది. ఇక తాజా ఎపిసోడ్ లలో రాజ్ తను ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు తను శ్వేత అని పరిచయం చేశాడు. ఇక రాజ్-శ్వేతలు రెగ్యులర్ గా కలుసుకోవడం, ఫోన్ లో మాట్లాడుకోవడం భరించలేని కావ్య పుట్టింటికి వెళ్ళి తన భాదని చెప్పుకుంటే అప్పుడే ఇందిరాదేవి వచ్చి రాజ్ కి దిమ్మ తిరిగే ప్లాన్ చెప్తుంది. కావ్య వాళ్ళ బావని అమెరికా నుండి తెప్పించి కొత్త ప్లాన్ రచిస్తుంది ఇందిరాదేవి. ఇక కావ్య, తన బావతో కలిసి తిరగడం , కబుర్లు చెప్పుకోవడం భరించలేని రాజ్ జెలస్ ఫీల్ అవుతుంటాడు. తాజా ఎపిసోడ్ లలో రాజ్ అత్తారింటికి వెళ్ళగా అక్కడ రాజ్ ని వదిలేసి కావ్య వాళ్ళ బావకి మర్యాదలు చేయడం అంతా ఫుల్ కామెడీగా సాగుతుంది.
అయితే అనామిక, ధాన్యలక్ష్మి, ప్రకాష్ కలిసి ఇన్‌స్టాగ్రామ్ లో ఓ రీల్ చేశారు. అది ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. యాక్టర్ గిరిశంకర్ రాయపురెడ్డి తన ఇన్ స్ట్రాగ్రామ్ లో ఈ రీల్ షేర్ చేశాడు. ఇప్పుడు బ్రహ్మముడి సీరియల్ టీఆర్పీలో నెంబర్ వన్ స్థానంలో ఉంది.
![]() |
![]() |